ఇసుక నిల్వలు పెంచాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-30T05:42:01+05:30 IST

ప్రజా అవసరాలకు ఇసుక కొరత లేకుండా నిల్వలు పెంచాలని కలెక్టర్‌ హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు.

ఇసుక నిల్వలు పెంచాలి : కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), డిసెంబరు 29: ప్రజా అవసరాలకు ఇసుక కొరత లేకుండా నిల్వలు పెంచాలని కలెక్టర్‌  హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ చాంబరులో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అందుబాటులో ఉండే ఇసుక రీచ్‌ల నుంచి ప్రజ ల అవసరాలకు సరిపడా ఇసుకను సేకరించి స్టాక్‌ పాయింట్లలో నిల్వలు పెంచాలన్నారు. ఈ నెలాఖరులలోపు ఇసుక కొరత లేకుండా కృషి చేయాలని ఆదేశించారు. భూగర్భ జల శాఖ అధికారులు సమన్వయంతో రీ సర్వేలు నిర్వహించి అను కూల మైన చోట ఇసుక రీచ్‌లను గుర్తించాలన్నారు. గండికోట రిజర్వాయర్‌ పునరావాసకాలనీల నిర్మాణాలు, రెండవ దశ నాడు-నేడు పనులు, అభివృద్ధి పనులు, ఇళ్ల నిర్మాణాలకు సరిపడా ఇసుక లభ్యమయ్యేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతాలైన సిద్దవటం మండల పరిధిలోని జ్యోతి-2, నందలూరులోని టంగుటూరు-2, రాజంపేటలోని బాలరాజుపల్లి-3,4 రీచ్‌లతోపాటు కమ లా పురం మండలంలోని ఎర్రబల్లి, వెదురూరు-2,3,4,5 ఇసుక రీచ్‌లను కొత్తగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు గట్టి చర్యలు తీసకోవాలన్నారు.  


యూకే నుంచి వచ్చిన వారు కొవిడ్‌ టెస్టులు చేసుకోవాలి

ఉత్తరకొరియా నుంచి జిల్లాకు వచ్చిన వారు తప్పక కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని  కలెక్టర్‌ హరికిరణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే 14 రోజుల పాటు గృహనిర్భంధంలో ఉండాలని ఆయన సూచించారు.

Updated Date - 2020-12-30T05:42:01+05:30 IST