-
-
Home » Andhra Pradesh » Kadapa » Sanaga crop searching
-
శనగ పంట పొలాలు పరిశీలన
ABN , First Publish Date - 2020-12-16T05:10:30+05:30 IST
నివర్ తుఫాను కారణంగా మండలంలోని దేవగుడి, సలివెందుల గ్రామాల్లో దెబ్బతిన్న శనగ పంట పొలాలను వ్యవసా య అధికారులు మంగళవారం పర్యటించి పరిశీలించారు.

జమ్మలమడుగు రూరల్, డిసెంబరు 15: నివర్ తుఫాను కారణంగా మండలంలోని దేవగుడి, సలివెందుల గ్రామాల్లో దెబ్బతిన్న శనగ పంట పొలాలను వ్యవసా య అధికారులు మంగళవారం పర్యటించి పరిశీలించారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం అధికారి గుంటూరు అధికారుల బృందం దెబ్బతిన్న శనగ పంట పొ లాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధిక వర్షాల కారణంగా దేవగుడి గ్రామంలో శనగ పంట దెబ్బతిన్న పొలాలను పరిశీలించి అక్కడ పంటను, కూలీల చేత తీయించి ఉండటాన్ని పరిశీలించి పంటకు ఎంత ఖర్చు చేశారు? ఏమేరకు పంట నష్టం జరిగిందని రైతులతో ముఖాముఖిగా చర్చించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు మండలంలో సుమారు 3,082 హెక్టార్లలో శనగ పంట దెబ్బతిందని రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ ఇన్నయ్యరెడ్డి, లక్ష్మణరావు, రామారావు, బాలగంగాధర్‌రెడ్డి పాల్గొన్నారు.