సఖి - దిశ సేవలను విస్తృత పరచాలి

ABN , First Publish Date - 2020-11-26T04:51:40+05:30 IST

సఖి - దిశ కేంద్ర సేవల అంశాలపై ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని వన్‌స్టా్‌ప సెంటర్‌ నిర్వహణ కమిటీ జాయింట్‌ కలెక్టరు సాయికాంత్‌వర్మ తెలిపారు.

సఖి - దిశ సేవలను విస్తృత పరచాలి

కడప(సెవెన్‌రోడ్స్‌), నవంబరు 25: సఖి - దిశ కేంద్ర సేవల అంశాలపై ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని వన్‌స్టా్‌ప సెంటర్‌ నిర్వహణ కమిటీ జాయింట్‌ కలెక్టరు సాయికాంత్‌వర్మ తెలిపారు. జిల్లా స్ర్తీ, శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జేసీ ఆధ్వర్యంలో సఖి- దిశ కేంద్ర  నిర్వహణ కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఖి -దిశ కేంద్ర సేవలను, పాఠశాల విద్యార్థులకు మంచి స్పర్శ - చెడు స్పర్శ, బాల్య వివాహాలు, లైంగిక వేఽధింపులపై అవగాహన వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ వెంకట రాజే్‌షకుమార్‌, అదనపు పథక సంచాలకులు ఖాసింసాహెబ్‌, అదనపు డీఎంహెచ్‌వో సఖి కేంద్ర అడ్మినిస్ట్రేటర్‌ అశ్వని, న్యాయవాది రాఘవరెడ్డి, భారత రత్న మహిళా మండలి ప్రెసిడెంట్‌ సరస్వతి, డీసీపీవో సుభాష్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read more