29, 30 తేదీల్లో సీపీ బ్రౌన గ్రంథాలయ రజతోత్సవాలు

ABN , First Publish Date - 2020-11-22T05:08:41+05:30 IST

సీపీ బ్రౌన గ్రంథాలయం ఏర్పాటై 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల 29, 30 తేదీల్లో రజతోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ గ్రంథాలయ బాధ్యులు మూల మల్లిఖార్జునరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

29, 30 తేదీల్లో సీపీ బ్రౌన గ్రంథాలయ రజతోత్సవాలు

పలు పుస్తకాల ఆవిష్కరణ

కడప (ఎడ్యుకేషన), నవంబరు 21 : సీపీ బ్రౌన గ్రంథాలయం ఏర్పాటై 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల 29, 30 తేదీల్లో రజతోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ గ్రంథాలయ బాధ్యులు మూల మల్లిఖార్జునరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో సీపీ బ్రౌన భాషా పరిశోధన కేంద్రం రజతోత్సవాల ప్రత్యేక సంచిక, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, విద్వాన కట్టా నరసింహులు వ్యాఖ్యానించిన వేమన పద్యాల పుస్తకాలు, పీఎ్‌సఎన మూర్తి రచించిన సీపీ బ్రౌన లైఫ్‌ ఇన లండన ఆఫ్టర్‌ హీ లెఫ్ట్‌ ఇండియా పుస్తకాలు ఆవిష్కరించనున్నారు. అలాగే సీపీ బ్రౌన భాషా పరిశోధన కేంద్రం ప్రచురించిన బమ్మెర పోతన, అయ్యలరాజు రామభద్రుడు, రామరాజ భూషణుడు, తాళ్లపాక తిమ్మక్క పుస్తకాలను సైతం ఆవిష్కరించనున్నారు. 30వ తేది ఉదయం 10గంటలకు ఆముదాల మురళితో అష్టావధానం, మధ్యాహ్నం 2గంటలకు యలమర్తి మధుసూధనచే సంగీత అవధానం నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమాల్లో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు కేతు విశ్వనాథరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, మాజీ శాసనమండలి సభ్యులు షేక్‌ హుసేన, ప్రముఖ అవధాని నరాల రామారెడ్డి, పలువురు సాహిత్యకారులు పాల్గొననున్నారు. కాగా రజతోత్సవాల ప్రారంభ సన్నాహక కార్యక్రమంలో భాగంగా 25, 26 తేదీల్లో అంతర్జాల శతాధిక కవి సమ్మేళనం, 27, 28 తేదీల్లో సీీపీ బ్రౌన జీవితం సాహిత్యకృషి అంతర్జాల సదస్సు నిర్వహించనున్నారు.

Read more