బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలి

ABN , First Publish Date - 2020-11-16T05:03:58+05:30 IST

67వ అఖిల భారత సహకార బ్యాంకు వారోత్సవాలను శనివారం ఘనంగా ప్రారంభించారు.

బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలి
జెండాను ఆవిష్కరిస్తున్న సింగిల్‌విండో ఛైర్మన్‌ నాగేశ్వరరెడ్డి

ప్రతి మండల కేంద్రంలోనూ సహకార వారోత్సవాలు

పాత అప్పుకట్టాలన్న అధికారులు

బ్రహ్మంగారిమఠం, నవంబరు 15: ప్రతి మండల కేంద్రంలోనూ 67వ అఖిల భారత సహకార బ్యాంకు వారోత్సవాలను శనివారం ఘనంగా ప్రారంభించారు. బి.మఠంలో సింగి ల్‌విండో ఛైర్మన్‌ సి.నాగేశ్వరరెడ్డి, మైదుకూ రు, కాశినాయన బ్యాంకుల్లో సీఈఓలు కూశె ట్టి వెంకటరమణ, వెంకటేశ్వర్లు, బికోడూరు లో సొసైటీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి జెండా ను ఆవిష్కరించారు. వివరాల్లోకెళితే...


 బి.మఠం కార్యక్రమంలో సింగిల్‌విండో ఛైర్మన్‌ సి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ సహ కార బ్యాంకు అభివృద్ధి తోడ్పాటు అందించా లని పిలుపునిచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమిరెడ్డిపల్లె ప్రాథమిక వ్య వసాయ సహకార పరపతి సంఘం నుంచి రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. గతంలో అధిక సంఖ్యలో రుణాలు పొందని వారు తిరిగి చెల్లించ డంలో వెనుకంజ వేస్తున్నారన్నారు. కార్యక్ర మంలో సొసైటీ డైరెక్టర్లు పోచంరెడ్డి రామి రెడ్డి, కూనపులి రాజానాయుడు, బ్యాంకు సిబ్బంది సీఈఓ అనిల్‌, గంగాధర్‌, రామి రెడ్డి, ఓబయ్య, బోలా శ్రీను పాల్గొన్నారు.


మైదుకూరులో....


మైదుకూరు, నవంబరు 15: సిండికేట్‌ రైతు సేవా సహకార సంఘం వారోత్సవాలను  ఘనంగా నిర్వహించారు. కార్యాలయంపై ప తాకాన్ని ఎగురవేసి సొసైటీ అభివృద్ధికి పా టు పడతానని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. నెహ్రూ ఆశయసాధనంగా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ముఖ్య కార్యనిర్వాహణా ధికారి కూశెట్టి వెంకట రమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, వైసీపీ నేత గళ్ల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


నర్సాపురంలో....


కాశినాయన నవంబర్‌15: దేశ వ్యవసాయాభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర కీలకమని నర్సాపురం వ్యవసాయ సహకార సం ఘం సీఈఓ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అఖిలభారత సహకార వారోత్సవాల్లో సీఈఓ మాట్లాడారు. కార్యక్రమంలో కార్యాలయ సి బ్బంది, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.


బి.కోడూరులో....



బి.కోడూరు, నవంబరు 15: మండలంలో స హకార వారోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సంఘం ద్వారా దీర్ఘకాలిక అప్పు తీసుకుని సక్రమంగా చెల్లించని వారు ఇప్పుడు చెల్లిస్తే కొత్త అప్పు తక్కువ వడ్డీతో పొందవచ్చని ఆయన తెలిపారు. సొసైటీ సూపర్‌వైజరు నారాయణరెడ్డి, సెక్రటరీ గుర్విరెడ్డి, పాలకవర్గ సభ్యులు వెంకటసుబ్బారెడ్డి, దుగ్గిరెడ్డి, రవీంద్రనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-16T05:03:58+05:30 IST