-
-
Home » Andhra Pradesh » Kadapa » Sachivalayam Opening
-
ఆదాయ వనరులు కల్పించుకోవాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-22T04:34:30+05:30 IST
పంచాయతీ అభివృద్ధి కోసం సచివాలయాల్లో ప్రజలకు ఆన లైన సేవలు అందిస్తూ ఆదా య వనరులను సమకూర్చుకో వాలని కలెక్టర్ హరికిరణ్ సూ చించారు.

దువ్వూరు, నవంబరు 21: పంచాయతీ అభివృద్ధి కోసం సచివాలయాల్లో ప్రజలకు ఆన లైన సేవలు అందిస్తూ ఆదా య వనరులను సమకూర్చుకో వాలని కలెక్టర్ హరికిరణ్ సూ చించారు. శనివారం దువ్వూరు మండలం గుడిపాడు, అన్నపు శాసు్త్రలపల్లెల్లో కొత్తగా నిర్మించి న సచివాలయాలను ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి ప్రారం భించారు. అనంతరం గుడిపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కలెక్టర్ మాట్లా డుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు రాష్ట్రాభివృద్ధికి ప్రామాణికాలుగా నిలిచాయన్నారు. ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్‌ఆర్ విలేజ్ క్లీనిక్ మూడింటిని ఒకే ప్రాంగణలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటివద్దకే సేవలు అందుతాయ న్నారు. అనంతరం గుడిపాడులో డ్రైనేజీ, సీసీ రోడ్లు, పొలాలకు వెళ్లే గ్రావెల్ రోడ్ల నిర్మాణం కోసం, శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని, పేదలకు ఇళ్లపట్టాలు మం జూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ సుబ్బారెడ్డి, తహసీల్దారు దామోదర్‌రెడ్డి, ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి, మైదుకూరు మార్కెట్ యార్డు ఛైర్మన శోభ, వైసీపీ నేతలు నాగిరెడ్డి, ఓబుళరెడ్డి, గోపిరెడ్డిబాబు, జయచంద్రా రెడ్డి, సంగన హరినాథరెడ్డి, బొంతపల్లె వెంకటసుబ్బారెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లెల్లలో శనివారం ఎమ్మెల్యే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్ కేంద్రం నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.