ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు తప్పనిసరి
ABN , First Publish Date - 2020-12-02T04:57:54+05:30 IST
ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి అన్నారు.
పులివెందుల టౌన్, డిసెంబరు 1: ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని రాజారెడ్డి కాలనీ, రాజీవ్‌నగర్ కాలనీలలో అక్రమకట్టడాలను మంగళవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆయా కాలనీలలో మురుగునీటి పైప్‌లైనుపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, వాటిని జేసీబీ ద్వారా తొలగించామన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పెద్దరంగాపురంలో పర్యటించారు. అక్కడి మౌలిక వసతులపై ఆరాతీశారు. వీధిలైట్లు, సిమెంటు రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నీటిసమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మురళీధర్, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.