-
-
Home » Andhra Pradesh » Kadapa » Rtc employees problems
-
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , First Publish Date - 2020-12-07T04:59:30+05:30 IST
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ ఎంపాయీస్ యూనియన్ ప్రొద్దుటూరు డిపో గౌరవాధ్యక్షుడు పాతకోట బంగారుమునిరెడ్డి పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 6 : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ ఎంపాయీస్ యూనియన్ ప్రొద్దుటూరు డిపో గౌరవాధ్యక్షుడు పాతకోట బంగారుమునిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజీఆర్ కల్యాణ మండపంలో ఆ యూనియన్ డిపో కార్యదర్శి చంద్రశేఖర్ అధ్య.క్షతన సర్వసభ్యసమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా బంగారుమునిరెడ్డిని, కార్యనిర్వాహక అధ్యక్షునిగా గోపాల్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ జోనల్ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, రాష్ట్ర రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, రీజనల్ కార్యదర్శి రామమూర్తి, డిపో అధ్యక్షుడు మాచయ్య, జోనల్ నాయకులు పీఎన్‌పీరెడ్డి, సీఆర్‌ఎల్ రెడ్డి, రీజనల్ నాయకులు బీవీపీ రెడ్డి, డిపో నాయకులు ఎ.వెంకటేశ్వర్లు, బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.