వైద్య కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2020-09-13T08:16:52+05:30 IST

వైద్య కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లు విడుదల

వైద్య కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లు విడుదల

పులివెందుల, సెప్టెంబరు 12: పులివెందులలో వైద్య కళాశాల నిర్మాణం కోసం రూ.500 కోట్లు విడుదల చేస్తూ శనివారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌ జవహర్‌రెడ్డి జీవో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పులివెందులలో 100 ఎంబీబీఎస్‌ సీట్లతో ఏర్పాటు కాబోయే ఈ కళాశాలలో మౌలిక సదుపాయాలు, సామాగ్రి, ఫర్నీచర్‌ కోసం నిధులు మంజూరు చేయాలని వైద్య విద్య డైరెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పులివెందులలో వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతులు ఇస్తూ శనివారం జీవో జారీ చేశారు. 

Updated Date - 2020-09-13T08:16:52+05:30 IST