ట్రక్కును ఢీకొన్న బైక్‌ : ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-31T05:06:31+05:30 IST

నందలూరు చెయ్యేరు వంతెనపై బుధవారం సాయంత్రం ట్రక్కును ఢీకొన్న సంఘటనలో బైక్‌పై వెళుతున్న ఇద్దరికి గాయాలయ్యాయి.

ట్రక్కును ఢీకొన్న బైక్‌ : ఇద్దరికి గాయాలు
ట్రక్కును ఢీకొని పడిపోయిన యువకులు

నందలూరు, డిసెంబరు 30 : నందలూరు చెయ్యేరు వంతెనపై బుధవారం సాయంత్రం ట్రక్కును ఢీకొన్న సంఘటనలో బైక్‌పై వెళుతున్న ఇద్దరికి గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి చెన్నైకి వెళుతున్న ట్రక్కు నందలూరు చెయ్యేరు బ్రిడ్జికి రాగానే రాజంపేట నుంచి బైకుపై వెళుతున్న ఇద్దరు యువకులు ఓవర్‌టేక్‌ చేయబోయి ట్రక్కును ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి  గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-12-31T05:06:31+05:30 IST