ఆయుర్వేద వైద్యానికి విశేష స్పందన.. బారులు తీరిన జనం

ABN , First Publish Date - 2020-02-08T10:29:32+05:30 IST

కడప నగరం ము న్సిపల్‌ మైదానంలో స్వర్గీయ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు సోదరుని కుమారుడు ఆ యుర్వేద వైద్యులు

ఆయుర్వేద వైద్యానికి విశేష స్పందన.. బారులు తీరిన జనం

కడప(కల్చరల్‌)ఫిబ్రవరి 7 : కడప నగరం ము న్సిపల్‌ మైదానంలో స్వర్గీయ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు సోదరుని కుమారుడు ఆ యుర్వేద వైద్యులు పాములపర్తి రామారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఆయుద్వేద చికిత్సకు విశేష స్పందన లభిస్తోంది. వెన్నుముక, కీళ్ళు, నరాలకు సంబంధించిన చికిత్సను రామారావు అందిస్తున్నారు. ఆయుర్వేద రంగంలో ప్రఖ్యాతుడైన రామారావు వద్ద చికిత్స తీసుకోవడానికి కడప జిల్లా నుండే గాక అనంతపురం, నెల్లూరు, తిరుపతి, హైదరాబాదు, కర్నాటక తదితర ప్రాం తాల నుంచి రోగులు చికిత్స నిమిత్తం రావడంతో మున్సిపల్‌ మైదానంలోని అయ్యప్ప ఆలయ ప్రాం గణం కిటకిట లాడింది. వేకువన 4 గంటలకే విపరీతం గా రోగులు రావడంతో 5 వందల మందికి రాత్రి వరకు వైద్య సేవలు అందించారు. రద్దీ ఎక్కువ కావడంతో పో లీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఈ చికిత్స నేడు, రేపు కూడా కొనసాగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఆధునిక కాలంలో తీవ్ర ఒత్తిడి మూలానా ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు రామారావు చక్కని వైద్యం అందిస్తాడనే నమ్మకంతో సులువుగా ఉపశమనం దక్కుతుందని విశ్వాసంతో విపరీతంగా రోగులు తరలివచ్చారని వారంటున్నారు. ఇవాల్టికి కూడా టోకన్లు ఇవ్వడంతో రద్దీ ఇలానే కొనసాగనుంది.

Updated Date - 2020-02-08T10:29:32+05:30 IST