నేడు 27 మంది మహిళా ఖైదీలు విడుదల

ABN , First Publish Date - 2020-11-27T06:42:09+05:30 IST

కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు శిక్ష అనుభవి స్తున్న 27 మంది మహిళా ఖైదీలను శుక్రవారం విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేశారు.

నేడు 27 మంది మహిళా ఖైదీలు విడుదల

కడప(క్రైం), నవంబరు 26: కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు శిక్ష అనుభవి స్తున్న 27 మంది మహిళా ఖైదీలను శుక్రవారం విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేశారు. వివిధ కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్‌ప్ర వర్తన కలిగి ఉండడంతో జైలు అధికారుల నివేదిక ఆధారంగా వారు విడుదల కాను న్నారు. నేడు జైలు నుంచి విడుదల కానున్న వారిలో బండి పద్మక్క, మారంరెడ్డి ఉమాదేవి, లావణ్య, పవిత్రభాయి, కురుకుండు లక్ష్మిదేవి, కురుకుండు రమణమ్మ, కురుకుండు పద్మావతమ్మ, కురుకుండు చంద్రకళ, శాంతమ్మ, రాజమ్మ, సుబ్బమ్మ, నాగవేణి, బాంధవి, రతన్‌, అమీన, లింగమ్మ, దూడు మరియమ్మ, నిర్మల, దొడ్డు భారతి, అంబడిపూడి జ్యోతి, దూడు లక్ష్మి, గుర్రమ్మ, ఈశ్వరమ్మ, మందల మేరి అలి యాస్‌ హిందూ, సావిత్రి, గజ్జల నారాయణమ్మ, మూలకాల ఈశ్వరమ్మ, ములకలపల్లె గ్రేసమ్మ అలియాస్‌ రాణిలు ఉన్నారు.

Read more