భూముల రీసర్వేతో రైతులకు మేలు
ABN , First Publish Date - 2020-12-12T04:37:42+05:30 IST
భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రీసర్వే చేపట్టిందని, భూ ముల రీసర్వేతో రైతులకు మేలు జరుగుతుందని మండల సర్వేయరు శివకుమార్ పేర్కొన్నారు
గోపవరం, డిసెంబరు 11: భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రీసర్వే చేపట్టిందని, భూ ముల రీసర్వేతో రైతులకు మేలు జరుగుతుందని మండల సర్వేయరు శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కాలువపల్లె పంచాయతీ సచివాలయంలో సిబ్బందికి, వలంటీర్లకు, సర్వేయర్లకు భూముల రీసర్వేపై అవగాహన చేపట్టారు. 21 నుంచి భూరక్షిత పథ కం రాష్ట్రమంతటా ప్రారంభించనున్నారని, ఇందుకోసం డిసెంబరు 14 నుంచి 19 వరకు జరిగే మొద టి విడత గ్రామసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సర్వే ప్రక్రియ లాభాలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. రీసర్వేపై ప్రజలకు ఏవైనా సందేహాలుంటే వివరించడం జరుగుతుందని, సంపూర్ణ సర్వే నిర్వహణ, యాజమాన్య హక్కు నిర్ధారణ, రికార్డుల్లో నమోదవుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానిక నేతలు పాల్గొన్నారు.