ఒక్క రేషన్‌కార్డు తొలగించినా సహించం

ABN , First Publish Date - 2020-12-11T05:30:00+05:30 IST

వైసీపీ సర్కారు సంక్షేమ పథకాల కుదింపు కోసం పేదల నోళ్లు కొట్టేందుకు తెల్లరేషన్‌కార్డులను తొలగిస్తోంది. ఒక్క రేషన్‌కార్డు తొలగించినా సహించేదిలేదు.

ఒక్క రేషన్‌కార్డు తొలగించినా సహించం
సమావేశంలో మాట్లాడుతున్న లింగారెడ్డి

పన్నులతో ప్రజల నెత్తిన భారం ఫ శ్రీనివాసరెడ్డిపై దాడి పిరికిపంద చర్య

టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి

కడప, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సర్కారు సంక్షేమ పథకాల కుదింపు కోసం పేదల నోళ్లు కొట్టేందుకు తెల్లరేషన్‌కార్డులను తొలగిస్తోంది. ఒక్క రేషన్‌కార్డు తొలగించినా సహించేదిలేదు. ప్రజలను భాగస్వామ్యం చేసుకుని పెద్ద ఎత్తున పోరా టం చేస్తామని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాటాడుతూ పలువురు పేదలకు పట్టెడన్నం పెట్టే పౌర సరఫరాలశాఖను 36 వేల కోట్లు అప్పుల ఊబి లో కూర్చిన ఘనత జగన్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇప్పటికే కందిబేడలు, చక్కెర ధర పెంచారన్నారు. ఇప్పుడు రేషన్‌కార్డులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పేదల ఉసురు కొట్టుకుని ప్రభుత్వం కూలిపోతుందన్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటనకు వెళ్లిన టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తదితర టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌ మాట్లాడుతూ జగన్‌ సీఎం అయినప్పటి నుంచీ రాష్ట్రానికి దరిద్రం పట్టుకుందన్నారు.   కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు మాట్లాడుతూ జగన్‌ పాదయాత్ర పొడవునా జనానికి ముద్దులు పెట్టి ఇప్పుడు పన్నుల పేరిట పిడిగుద్దులు గుద్దుతున్నారన్నారు.  కాగా టీడీపీ నేతలపై దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి చిత్తూరు జిల్లా వాయల్పాడు, వాల్మీకిపురం పోలీసుస్టేషన్‌లో ఉన్న టీడీపీ నేతలను పరామర్శించారు. ఫ మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.జయశ్రీ


Updated Date - 2020-12-11T05:30:00+05:30 IST