రేషన్ షాపుల మ్యాపింగ్ పూర్తి చేయండి
ABN , First Publish Date - 2020-12-12T05:15:07+05:30 IST
ప్రొద్దుటూరు నియోజక వర్గ పరిధిలోని 71 రూరల్, అర్బన్ సచివాలయాల పరిధిలోని రేషన్ దుకాణాలను మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని తహసీల్దారు నజీర్ అహ్మద్ వీఆర్‌ఓలను ఆదేశించారు.
ప్రొద్దుటూరు అర్బన్, డిసెంబరు 11 : ప్రొద్దుటూరు నియోజక వర్గ పరిధిలోని 71 రూరల్, అర్బన్ సచివాలయాల పరిధిలోని రేషన్ దుకాణాలను మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని తహసీల్దారు నజీర్ అహ్మద్ వీఆర్‌ఓలను ఆదేశించారు. శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయంలో వీఆర్‌ఓల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి నెల నుంచి రేషన్ సరుకులు ఇంటింటికి పంపిణి చేసే ప్రక్రియను ప్రారంభిస్తారన్నారు.ఏ సచివాలయాల పరిధిలోకి ఏ ఏ రేషన్ షాపులు వస్తాయో పూర్తి స్ధాయి నివేదికను రెండురోజుల్లో సిద్ధం చేయాలన్నారు. డీలర్ల సహకారం తీసుకుని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఖారారు చేయాలన్నారు. బియ్యం.కార్డుల మ్యాపింగ్ ప్రకియను పూర్తిచేయని వారిపై చర్యలు తప్పవన్నారు. కొత్త కార్డులను సకాలంలో విచారించి మంజూరు చేసేలా కృషి చేయాలన్నారు. రెవెన్యూ సేవల్లో నిర్లక్ష్యంను ఉపేక్షించబోమన్నారు. కార్యక్రమంలో పౌరసర ఫరాల డిప్యూటీ తహసీల్దారు వరదకిషోర్ రెడ్డి ఆర్‌ఐ సుదర్శన్‌లు పాల్గొన్నారు