-
-
Home » Andhra Pradesh » Kadapa » Ramaiah Vihara on Garuda Vahanam
-
గరుడవాహనంపై రామయ్య విహారం
ABN , First Publish Date - 2020-04-07T09:10:21+05:30 IST
కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం ఉదయం యాగశాలలో హోమాది అనంతరం

నేడు సీతారాముల కల్యాణం
ఒంటిమిట్ట, ఏప్రిల్ 6 : కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం ఉదయం యాగశాలలో హోమాది అనంతరం మోహినీ అవతారంలో జగదభిరాముడు దర్శనమిచ్చాడు. రాత్రి గరుడవాహనంపై సీతారామలక్ష్మణులు విహరించి దర్శనమిచ్చారు. రామాలయంలో ఉదయం కార్యనిర్వహణ అధ్యక్షుడు రాజే్‌షబట్టర్ ఆధ్వర్యంలో పూజలు, మహామంగళహారతి అనంతరం సోమవారం రాత్రి గరుడ వాహనంపై సీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించి ఆగమశాస్త్ర ప్రకారం వేదపండితులు వేదమంత్రోచ్ఛారనల మధ్య స్వామి విహరించారు. కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాధం, సీఐ హనుమంతునాయక్, ఎస్‌ఐ అమర్‌నాధరెడ్డి, అర్చకులు వీణారాఘవాచార్యులు, శ్రావణ్‌కుమార్, టీటీడీ అధికారులు ధనుంజయుడు, యువరాజు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు సీతారాముల కల్యాణం
కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 8 గంటలకు సీతారాముల కల్యాణ మహోత్సవ ఘట్టాన్ని ఆగమశాస్త్ర ప్రకారం ఆలయంలోని గర్భగుడి వెనుక భాగంలో నిర్వహించనున్నారు. ఉదయం శివధనుర్భాలంకారంలో కోదండరాముడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కల్యాణం ఏర్పాట్లపై డిప్యూటీ ఈవో లోకనాధం అర్చకులతో సమాలోచనలు జరిపారు.