రాజ్యాంగం దేశ సంపద

ABN , First Publish Date - 2020-11-27T06:34:29+05:30 IST

భారత రాజ్యాంగం మన దేశ సంపద అని వీసీ సూర్యకళావతి అన్నారు.

రాజ్యాంగం దేశ సంపద
వెబ్‌నార్‌ ద్వారా ప్రసంగిస్తున్న వీసీ సూర్యకళావతి

వెబ్‌నార్‌ సదస్సులో వీసీ సూర్యకళావతి

కడప(వైవీయూ), నవంబరు 26: భారత రాజ్యాంగం మన దేశ సంపద అని వీసీ సూర్యకళావతి అన్నారు. వైవీయూలో పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధ్యాపకుడు డాక్టర్‌ సతీ్‌షబాబు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వెబ్‌నార్‌ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌ పాల్గొని భారత రాజ్యాంగం గురించి వివరించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ రఘునాథరెడ్డి, అధ్యాపకులు పార్వతి, గోవర్ధన్‌నాయుడు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైవీయూలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దీపికను వీసీ సూర్యకళావతి ఆవిష్కరించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగం రచనలో అంబేడ్కర్‌ పాత్ర గురించి కొనియాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T06:34:29+05:30 IST