ఎడతెరపిలేని వర్షంతో అన్నీ కష్టాలే..

ABN , First Publish Date - 2020-11-27T05:55:45+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో గురువారం తెల్లవారుజామున నుంచి ఎడతెరపిలేని వర్షం పడుతుండడంతో జనం తీవ్ర ఇక్కట్లు పడ్డారు.

ఎడతెరపిలేని వర్షంతో అన్నీ కష్టాలే..
ప్రొద్దుటూరు పరిధిలోని వనిపెంటలో కూలిన చెట్లు

ప్రొద్దుటూరు, నవంబరు 26 : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో గురువారం తెల్లవారుజామున నుంచి ఎడతెరపిలేని వర్షం పడుతుండడంతో జనం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఈదురు గాలుల కారణంగా మైదుకూరు మండలంలోని వనిపెంట వద్ద చెట్లు నెలకొరిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలి గింది. రాజుపాలెం మండలంలోని సోమాపురం, కొర్రపాడు గ్రామాల్లో గృహలు దెబ్బతిన్నాయి. ముద్దనూరులో చెరువు కట్ట మరమ్మత్తులు చేయకపోవడంతో వర్షపునీరు తోడై చెరువులోని నీరు వంకపాలైంది. ఈ వర్షం వల్ల వరిపంటకు భారీగా నష్టం వాటిల్లింది. చాపాడు మండలంలో సుమారు 10వేల ఎకరాల్లో పంట నెలకొరిగింది. దువ్వూరు మండలంలో 500 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. మైలవరం మండలంలో 200 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. ఎర్రగుంట్ల మండలంలో కుంభ వృష్టి కురవడంతో పట్టణంలో పలు చోట్ల  గృహాల మధ్య వర్షపునీరు నిలిచిపోయింది. ప్రొద్దుటూరు మండల పరిధిలో కూడా వరి పంట దెబ్బతింది.  తుఫాన్‌  వర్షంతో పాటు చలిగాలుల వల్ల ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్మాణ పనులు లేకపోవడం కూ లీలు,  చిరువ్యాపారుల జీవనం స్తంభించింది. ఈదురు గాలులు వీస్తుండటంతో విద్యుత్‌ సిబ్బంది అప్రమత్తమై, పలు చోట్ల పర్యవేక్షణలు మొదలు పెట్టారు. కుందూ నదీ ప్రవాహిక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం వరద ప్రభావిత గ్రామాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. పెద్దముడియం మండలంలో ఎన్‌.కొట్టాలపల్లి, పాలూరు, మరో చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాజుపాలెం మం డలం టంగుటూరు జడ్పీ హైస్కూల్‌లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అధికారులు అక్కడే ఉన్నారు. గతంలో వరద ప్రభావితమైన గ్రామాల్లో ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. ఇపుడు కూడా అధికారులు తరచూ ఆయా గ్రామాల్లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. వర్షం కొనసాగుతుండటంతో పాత కట్టడాల్లో ఉండొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో పూరిల్లు, గుడారాల అధారంగా నివాసం ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు రావాలంటూ మున్సిపల్‌ కమిషనర్‌ రాధ సూచించారు. పట్టణంలో ఆరు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ఎర్రగుంట్లలో 111.60 మి.మీ. వర్షం

ఎర్రగుంట్ల, నవంబరు 26: నివర్‌ తుఫాన్‌ కారణంగా మండలంలో గురువారం ఒక్క రోజే 111.6మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసినట్లు రెవె న్యూ అధికారులు తెలిపారు. నగర పంచాయతీలోని రాణీవనం, శాంతి నగర్‌లలో భారీగా వర్షపునీరు చేరడంతో లోతట్టు  ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాంతినగర్‌లో భారీగా నీరుచే రి ఇబ్బందికరపరిస్థితి నెలకొనడంతో మాజీ కౌన్సిలర్‌ టైలర్‌ శివ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డికి ఫోన్‌ద్వారా పరిస్థితిని వివరించడంతో ఆయన వెంట నే అధికారుల ద్వారా  ఎక్స్‌కవేటర్‌ను పంపి నీరు వెళ్లేందుకు కాలువను ఏర్పాటు చేయించి నీటిని పంపించారు.  పి.వెంకటాపురంలో చెట్టు విరిగి రోడ్డుపై పడటంతో రెవెన్యూ అధికారులు వెంటనే తొలగించారు.  రెవె న్యూ అధికారులు  తుఫాన్‌ పట్ల చాలా అప్రమత్తంగా ఉన్నారు.  ముఖ్యంగా గ్రామాల్లో వంకలు, పెన్నానదీ తీరం వెంబడి ఉండే వారికి అన్ని జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. గురువారం ఉదయం తహసీల్దార్‌ ఏ.నాగేశ్వరరావు అధ్యక్షతన ప్రత్యేకాధికా సత్యప్రకాష్‌, కమిషనర్‌ రంగస్వామి, ఇతర మండల టీంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు. 

 230మందికి పునరావాసం : తహసీల్దార్‌

వర్షం వల్ల నిరాశ్రయులైన 230 మందికి ఎర్రగుంట్ల నగర పంచాయతీలో అధికారులు పునరావాసం కల్పించారు. ఇందులో మూడు జడ్పీ పాఠశాలల్లో 50మందిని, పోట్లదుర్తిలో  హాస్టల్‌, కళ్యాణమంటపంలోను, హైస్కూల్‌లోను, కలమల్ల ఆర్టీపీపీలలో 180 మందికి  అశ్రయం కల్పించి వారికి భోజన వసతి ని ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్‌ ఏ.నాగేశ్వరరావు తెలిపారు.   వై.కోడూరు, చిలమకూరు, సున్నపురాళ్లపల్లె, పోట్లదుర్తి, కోగటం రస్తాలోని వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు. కాగా పంటపొలాల్లోకి నీరు చేరడంతో వరి, శనగ, పత్తి, అరటి, ఇతర వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లునట్లు రైతులు తెలిపారు. ఇటీవల మండలంలో శనగపంటను భారీగా వేశారు. వర్షం అధికమైతే పంట కుళ్లిపోతుందని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుచేసిన రైతులు కోతకు వచ్చిన పంట నీటముని గిపోతోందని ఆందోళన చెందుతున్నారు. 

మైలవరంలో..

మైలవరం, నవంబరు 26 : నివర్‌ తుపాన్‌ ప్రభావంతో గురువారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పత్తి, వరి, శనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి. పత్తి పంట దిగుబడి వచ్చే సమయంలో వర్షానికి తడిసి ముద్దయి కుళ్లిపోతుందని రైతులు తెలిపారు. శనగ పంట సాగుచేసి నెల రోజులు కావస్తుందని ఈ సమయంలో వాన రావడంతో  పంటకూడా దెబ్బతినే అవకాశం

ఉందని అలాగే వరి కూడా దెబ్బతిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  మండలంలోని పలు గ్రామాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి వీధుల్లో నీరు నిలిచాయి. 

రాజుపాళెంలో..

రాజుపాళెం నవబంరు26: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పత్తి, వరి పంటలకు నష్టం వాటిళ్లుతోందని రైతులు వాపోతున్నారు. స్పెషల్‌ అఫీసర్‌ రాజశేఖర్‌,  తహసీల్దారు ఉదయ భారతి, ఎంపీడీవో సయ్యద్‌ వున్నిసా లోతట్టు గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. కొర్రపాడు, సొమపురం గ్రామాల్లో మూడు మట్టి మిద్దెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

 వరి పంటకు తీవ్ర నష్టం

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 26: నివర్‌ తుఫాను కారణంగా మండలంలోని ధర్మాపురం, దానవులపాడు, పెద్దదండ్లూరు, దేవగుడి, అంబవరం, గూడెం చెరువు, తదితర గ్రామాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధర్మాపురం చుట్టుపక్కల గ్రామాల్లో  కొన్ని చోట్ల రైతులు వరి పంట కోత అనంతరం ప్రధాన రోడ్లపైనే పట్టలు కప్పి ఉన్నారు. అలాగే దుత్తలూరు నగర్‌ సమీపాన మిరప పంట పొలంలో రైతులు కోసిన మిరప పండును పట్టలతో కప్పి ఉంచారు.ఎడతెరపి లేనివానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  జమ్మలమడుగులో గురువారం మధ్యాహ్నం వరకు 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆర్డీవో కార్యాలయ అధికారి రాజమన్నార్‌ తెలిపారు. మోరగుడి, జమ్మలమడుగు నగర పంచాయతీ శివార్లలో ప్రధాన రోడ్లపై వర్షపునీరు నిలిచింది. వర్షం వల్ల ఆర్డీవో కార్యాలయం ఉరుస్తుండడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 

ముద్దనూరులో చెరువు నీరు వృథా

ముద్దనూరు నవంబరు26: నివర్‌ తుఫాన్‌కు వర్షం కురుస్తుండటంతో గండి పడిన చెరువు నుంచి నీరు వృథాగా పోతోంది. ముద్దనూరు చెరువుకు గండి పడి రెండు నెలలు దాటినా మరమ్మతులు చేయకపోవడంతో  తుఫానుతో కురుస్తున్న భారీ వర్షాలతో వర్షపు నీరు చెరువులోకి భారీగా చేరుతున్నా  వృఽథాగా పోయింది. చెరువుకు గండి పడకుంటే దాదాపు ఒక సంవత్సరం పాటు సాగు, తాగునీటికి సమస్య ఉండేది కాదు. 

శాశ్విత పనుల కోసం ప్రతిపాదనలు

చెరువు గండి పడిన చోట  శాశ్వితి ప్రాతిపదికన పనుల కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఇరిగేషన్‌ డివిజన్‌ ఏఈ జగదీ్‌షరెడ్డి తెలిపారు. ఇందుకు దాదాపు రూ.30లక్షలు ఖర్చు అవుతుందని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.





Updated Date - 2020-11-27T05:55:45+05:30 IST