అనుకూల గ్రామాల్లోనే పట్టాలివ్వాలి

ABN , First Publish Date - 2020-12-27T05:03:35+05:30 IST

అనుకూలమైన గ్రామాల్లోనే ఇళ్ల పట్కకటలు ఇవ్వాలని గానుగపెంట, ఎస్‌.వెంకట్రామాపురం వాసులు తహసీల్దారు అయూబ్‌ను కోరారు.

అనుకూల గ్రామాల్లోనే పట్టాలివ్వాలి

పోరుమామిళ్ల, డిసెంబరు 26: అనుకూలమైన గ్రామాల్లోనే ఇళ్ల పట్కకటలు ఇవ్వాలని గానుగపెంట, ఎస్‌.వెంకట్రామాపురం వాసులు తహసీల్దారు అయూబ్‌ను కోరారు. శనివారం గానుగపెంట పంచాయతీలో ఇళ్లపట్టాల పంపిణీని తహసీల్దారు ఆయూబ్‌ఖాన, స్పెషల్‌ ఆఫీసరు వెంకటసుబ్బారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జునరెడ్డి, మండల కన్వీనరు సీఎంబాషా, సహకార సంఘం అధ్యక్షుడు వెంగల్‌రెడ్డి ప్రారంభించారు.

అయితే గ్రామంలో 36 మందికి పట్టాలు మం జూరవగా గానుగపెంటలో  పదిమంది, ఏడుగురు ఎస్‌.వెంకట్రామాపురం లబ్ధిదారులు తమ గ్రామాల్లోనే పొజిషన సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరినట్లు తహసీల్దారు తెలిపారు. ఆర్‌ఐ సిద్దేశ్వరయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:03:35+05:30 IST