-
-
Home » Andhra Pradesh » Kadapa » Raed Sandels
-
పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ABN , First Publish Date - 2020-12-16T04:44:59+05:30 IST
రవాణా చేసేందుకు సిద్దంగా ఉన్న పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయకుమార్ మంగళవారం విలేకరులకు తెలియచేశారు.

మైదుకూరు, డిసెంబరు 15: అక్రమంగా రవాణా చేసేందుకు సిద్దంగా ఉన్న పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయకుమార్ మంగళవారం విలేకరులకు తెలియచేశారు. స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ రహస్య సమాచారం మేరకు బసాపురం శివారు మామిడి తోట వద్ద నిఘా పెట్టగా అక్కడున్న జాండ్లవరం వాసి మాచుపల్లె శ్రీనివాసులు ఉరఫ్ డాన్ శీను, జంగంపల్లెకు చెంది న నానుబాల రాముడు ఉరఫ్ అందాల రాముడు, పేర్నపాటి మస్తాన్‌ను అరెస్టు చేసి, 10 దుంగలను స్వాధీనం చేసుకునున్నామన్నారు. ఈ సంఘటనలో అర్బన్ సీఐ మధుసూదనగౌడ్, ఎస్‌ఐ రమణ, సిబ్బంది పాల్గొన్నారన్నారు.