విజయదుర్గాలయంలో రాహుకాల పూజలు

ABN , First Publish Date - 2020-03-18T05:55:52+05:30 IST

నగరంలోని విజయదుర్గాదేవి ఆలయంలో మంగళవారం రాహుకాల పూజలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ

విజయదుర్గాలయంలో రాహుకాల పూజలు

కడప(కల్చరల్‌), మార్చి 17: నగరంలోని విజయదుర్గాదేవి ఆలయంలో మంగళవారం రాహుకాల పూజలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి చల్లని చూపుల తల్లిని భక్తితో కొలిచారు. అమ్మకు ఇష్టమైన నిమ్మకాయ దీపాలను వెలిగించి పూజలు చేశారు. రాహుకాల పూజలు చేయడం వలన సమస్యలు దూరమై, మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు వేకువన అమ్మవారికి విశేషపంచామృతాభిషేకం, నామార్చనలు చేశారు.


అమ్మవారిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉద్యోగ, సంతాన ప్రాప్తికి, గ్రహదోషాల నివారణకు రాహుకాలపూజలు తోడ్పడతాయని అర్చకులు భక్తులకు తెలియజేశారు. ఆలయంలో ప్రతి శుక్రవారం కుంకుమార్చనలు, ప్రతి నెలా రెండో ఆదివారం దుర్గామల్లిఖార్జునుల కల్యాణం, షౌర్ణమి పూజల గురించి ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్‌ భక్తులకు వివరించారు.

Updated Date - 2020-03-18T05:55:52+05:30 IST