ప్రజాధనం దుర్వినియోగం

ABN , First Publish Date - 2020-12-18T04:57:19+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా బీసీ కార్పొరేషన్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.రెడ్డిబాబు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ప్రజాధనం దుర్వినియోగం

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధ్వజం

కడప(మారుతీనగర్‌), డిసెంబరు 17: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా బీసీ కార్పొరేషన్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.రెడ్డిబాబు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను ఏర్పాటు చేసి బీసీలను ప్రలోభపెట్టాలనుకోవడం సీఎంకు తగదన్నారు. అసలే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ మీనమేషాలు లెక్కపెడుతూ బీసీ కార్పొరేషన్లకు చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు అన్నారు. వీరికి ఇచ్చే జీతాలు దాదాపు రూ.62.63 కోట్లు ఉంటుందని, ఈ డబ్బును సబ్సిడీ లోన్ల ద్వారా బీసీలకు ఉపయోగిస్తే కొన్ని వేల మందికి ఉపాఽధి దొరుకుతుం దన్నారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు బాలరాజు, వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు వివేకానంద, చిన్న, శేఖర్‌,  మణి కుమార్‌, సంజీవ్‌, కళ్యాణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T04:57:19+05:30 IST