అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: ఎస్పీ

ABN , First Publish Date - 2020-11-08T04:58:02+05:30 IST

‘అధై ర్యపడొద్దు.. అండగా ఉంటాం’ అని ఎస్పీ కేకేఎన అన్బురాజన ఇ టీవల అనారోగ్యంతో మృతి చెం దిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ సి.నాగముని, హోంగార్డు హెచజీ గంగిరెడ్డి కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: ఎస్పీ
చెక్కును అందిస్తున్న ఎస్పీ అన్బురాజన

కడప (క్రైం), నవంబరు 7: ‘అధై ర్యపడొద్దు.. అండగా ఉంటాం’ అని ఎస్పీ కేకేఎన అన్బురాజన ఇ టీవల అనారోగ్యంతో మృతి చెం దిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ సి.నాగముని, హోంగార్డు హెచజీ గంగిరెడ్డి కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఆయా కుంటుంబాలకు ఎస్పీ రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ సి.నాగముని సతీమణి జయకుమారి, హోంగార్డు గంగిరెడ్డి సతీమణి స్వర్ణలతకు జిల్లా పోలీసు కార్యాలయంలో చెక్కులు అందించారు. పోలీసు వితరణ నిధి నుంచి ఈ మొత్తాన్ని అందించారు. అనారోగ్యంతో మరణించిన హెచసీ రవిచంద్ర తండ్రి స్వామిదా్‌సకు కార్పస్‌ నిధి నుంచి రూ.లక్ష అంద జేశారు. అనంతరం ఆయన వారి కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు.  

గంగిరెడ్డిపల్లె పీఎ్‌సలో...

విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన డి.రామక్రిష్ణ సతీమణి గంగాదేవికి రూ.4లక్షలు, జిల్లా ఆర్మ్డ్‌ రిజర్వు విభాగంలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన సి.నాగముని సతీమణి జయకుమారికి రూ.4లక్షల భద్రత పథకం చెక్కులను ఎస్పీ అన్బురాజన అందించారు. 

Updated Date - 2020-11-08T04:58:02+05:30 IST