జాతీయ తైబాక్సింగ్ పోటీలకు ఎంపిక
ABN , First Publish Date - 2020-12-31T05:12:18+05:30 IST
జాతీయస్థాయి తైబాక్సింగ్ పోటీలకు ప్రొద్దుటూరు విద్యార్థులు ఎంపికయ్యారు.

ప్రొద్దుటూరు టౌన్, డిసెంబరు 30: జాతీయస్థాయి తైబాక్సింగ్ పోటీలకు ప్రొద్దుటూరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ తైబాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి తైబాక్సింగ్ పోటీలు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పోటీల్లో వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూలు, జవహర్ బాల కేంద్రం విద్యార్థులు ఆరు బంగారు పతకాలు, రెండు వెండి పతకాలు, ఒక కాంస్య పతకం గెలుచుకున్నారు. సబ్ జూనియర్ బాలికల విభాగంలో హేమవందన, అండర్-12 విభాగంలో శిరిచందన, హేమశ్రీ బంగారు పతకాలను సాధించారు. లాస్యప్రియ వెండిపతకం సాధించింది. అండర్-9 బాలుర విభాగంలో హజీజ్‌బాబు బంగారు పతకం సాధించారు. అండర్-12 విభాగంలో జగన్‌మోహన్‌రెడ్డి, శివవసంత్‌లు వెండి పతకాలు, యశ్వంత్ కాంస్య పతకం, మహిళల సీనియర్ విభాగంలో నాగలక్ష్మి బంగారు పతకం సాధించింది. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు ఫిబ్రవరిలో హైదరాబాదులో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను కోచ్ మాస్టర్ మునీశ్వర్, వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూలు హెచ్‌ఎం కాశీప్రసాద్‌రెడ్డి, వైఎస్‌ఆర్ తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాలువ నాగేంద్ర, వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి, డాక్టర్ సబిత అభినందించారు.