ప్రొద్దుటూరు డీఎఫ్‌ఓగా నాగార్జునరెడ్డి
ABN , First Publish Date - 2020-09-01T10:17:44+05:30 IST
ప్రొద్దుటూరు డీఎఫ్‌ఓగా నాగార్జునరెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 31 : ప్రొద్దుటూరు డీఎ్‌ఫవోగా ఎం.నాగార్జునరెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ డీఎ్‌ఫవోగా పనిచేస్తున్న గురుప్రభాకర్ బదిలీ కాగా, ఆయన స్థానంలో తిరుపతిలో డీఎ్‌ఫవోగా పనిచేస్తున్న నా గార్జునరెడ్డిని ఇక్కడికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బదిలీ అయిన డీఎ్‌ఫవో గురుప్రభాకర్ వీడ్కోలు సభ నిర్వహించి అధికారులు, సిబ్బంది దుశ్శాలువతో ఘనంగా సన్మానించగా కొత్త డీఎ్‌పవోకు స్వాగతం పలుకుతూ సత్కరించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు డివిజన్ అటవీ పరిధిలోని ఎఫ్‌ఆర్‌ఓలు పాల్గొన్నారు.