ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోండి

ABN , First Publish Date - 2020-09-06T09:13:56+05:30 IST

కరోనాతో ఆరు నెలలుగా వేతనాలు రాని ప్రైవే టు ఉపాధ్యాయులకు వెంట నే జీతాలు చెల్లించి ఆదుకో వాలని ఆ సంఘం నేతలు

ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోండి

ప్రొద్దుటూరు టౌన్‌, సెప్టెంబరు 5: కరోనాతో ఆరు నెలలుగా వేతనాలు రాని ప్రైవేటు ఉపాధ్యాయులకు వెంట నే జీతాలు చెల్లించి ఆదుకో వాలని ఆ సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. ప్రైవేటు లెక్చరర్స్‌, టీచర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం ర్యాలీగా వచ్చి ఉపాధ్యాయ సేవా కేంద్రంలో ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పోర్టో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, పీఎల్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌రెడ్డిలు మాట్లాడుతూ కరోనా సాకుతో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించ లేదని దీనిపై ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితంలేదన్నారు.  కార్యక్రమంలో పీఎల్‌టీయూ నాయకులు రాజు, హనుమాన్‌రెడ్డి, జాన్‌, మహబూబ్‌బాష, ఎంటీఏ రామచంద్ర, కొండయ్య, మధుసూదన్‌బాబు, సీపీఎస్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-06T09:13:56+05:30 IST