-
-
Home » Andhra Pradesh » Kadapa » Prepare Quarantines in jammala madugu
-
జమ్మలమడుగులో క్వారంటైన్లు సిద్ధం
ABN , First Publish Date - 2020-05-13T07:58:34+05:30 IST
జమ్మలమడుగు లో దూరప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం జిల్లా అధికారుల ఆదేశానుసారం క్వారంటైన్లను సిద్ధం చేసినట్లు

జమ్మలమడుగు రూరల్, మే 12: జమ్మలమడుగు లో దూరప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం జిల్లా అధికారుల ఆదేశానుసారం క్వారంటైన్లను సిద్ధం చేసినట్లు తహసీల్దారు మధుసూదన్‌రెడ్డి, కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, గూడెం చెరువు రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో కస్తూరిబా పాఠశాల, గ్రామాల్లో గ్రామ సచివాలయాలను ఇప్పటికే సిద్ధం చేశామన్నా రు. తమిళనాడు కోరంబేడుకు వెళ్లినవారిలో గండికోట, జమ్మలమడుగు ప్రాంతంలో ఎనిమిది మంది వరకు ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని వారిని విచారించి క్వారంటైన్‌కు పంపడం జరుగుతుందని టెస్టింగ్ కూడా చేస్తారన్నారు. ఇంతవరకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని జమ్మలమడుగు, మైలవ రం, పెద్దముడియం, కొండాపురం, ముద్దనూరు ప్రాం తాల్లో కరోనా కేసులు లేకపోవడంతో గ్రీన్‌జోన్లుగా ఉన్నాయని, ఒక్కసారిగా తమిళనాడులో కొందరు వెళ్లి వచ్చారని దీంతో ప్రజలు భయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటుండగా మంగళవారం పోలీసు అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దుకాణాలు తెరచుకోవాలని ఆదేశించా రు. దీంతో కూరగాయల మార్కెట్ వ్యాపారులు తహసీల్దారు మధుసూదన్‌రెడ్డి, కమిషనర్ వెంకటరామిరెడ్డిని కలిసి ఉదయం వేళ మాత్రమే ప్రజలకు సౌకర్యం గా ఉంటుందని, ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తమకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. దీంతో తహసీల్దారు రోజులాగానే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని కూరగాయల వ్యాపారులకు సూచించారు.
ఏడు మంది కోవిడ్ టెస్ట్‌కు తరలింపు
జమ్మలమడుగు నుంచి మంగళవారం మధ్యాహ్నం ఏడు మందిని కోవిడ్ టెస్ట్‌కు తరలించినట్లు అర్బన్ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. 15 రోజుల క్రితం జమ్మలమడుగు, గండికోట ప్రాంతం నుంచి తమిళనాడు, కోయంబత్తూరు, చుట్టుపక్కల ప్రాం తాలకు ఆర్టీసీ, డీజీటీ వాహనంలో ఇద్దరు కార్మికులు వెళ్లారు. అలాగే మరికొందరు నిమ్మకాయలు, చీనీకాయలు వ్యాపారం కోసం ఆ ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. రెండు రోజుల క్రితం నుంచి రాష్ట్రంలో కోయంబేడు తమిళనాడుకు వెళ్లివచ్చినవారు కోవి డ్ పాజిటివ్‌లు నమోదు కావడంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ముందస్తుగా సమాచారం ప్రకారం గుర్తించి ప్రొద్దుటూరు కోవిడ్ టెస్ట్‌కు పంపడం జరిగిందన్నారు. దుకాణాలకు బుధవారం నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనుమతులు ఇస్తున్నట్లు సీఐ తెలియజేశారు.