దక్షిణ రాజగోపుర ద్వారబంధం ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2020-12-06T04:59:22+05:30 IST

రాయలసీమలో ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో దక్షిణ రాజగోపురం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

దక్షిణ రాజగోపుర ద్వారబంధం ప్రతిష్ఠ
పూజలు నిర్వహిస్తున్న ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి

చక్రాయపేట, డిసెంబరు 5: రాయలసీమలో ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో దక్షిణ రాజగోపురం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇం దులో భాగంగా శనివారం పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి దక్షిణ రాజగోపుర ద్వారబంధం ప్రతిష్ఠాపన చేయించారు. ద్వారబంధానికి అర్చకుడు పూజలు చేసి హారతులు ఇచ్చా రు. ఆలయ సహాయ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌ ఆలయంలో  అభివృద్ధి పనులు చేయించారు. వైసీపీ సమన్వయకర్త ఓబుల్‌రెడ్డి, కాంట్రాక్టర్‌ వెంకటసుబ్బయ్య, వైసీపీ నాయకుడు రామాంజనేయరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు రాజారమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T04:59:22+05:30 IST