తెలుగు ప్రజల కోసం పోరాడిన యోధుడు

ABN , First Publish Date - 2020-12-16T04:46:55+05:30 IST

మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజల కోసం పోరాడిన యోధుడు అమరజీ వి పొట్టిశ్రీరాములు అని ఎంపీడీఓ సుజాతమ్మ కొనియాడారు.

తెలుగు ప్రజల కోసం పోరాడిన యోధుడు
పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వస్తున్న రెడ్యం

పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

అట్లూరు,డిసెంబరు 15: మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజల కోసం పోరాడిన యోధుడు అమరజీ వి పొట్టిశ్రీరాములు అని ఎంపీడీఓ సుజాతమ్మ కొనియాడారు.  పొట్టి శ్రీరాముల వర్థంతి పురస్కరించుకు ని మంగళవారం అన్ని సచివాలయాల్లో  ఆయన చిత్రాపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల ర్పించారు. అనంతరం ఆమె మాట్లా డుతూ తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు ప్రాణాలర్పించిన త్యాగజీవి అని వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శు లు వెంటకసుబ్బయ్య, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, కొండయ్య సిబ్బంది పాల్గొన్నారు.

ఖాజీపేటలో...

ఖాజీపేట, డిశంబరు15: తెలుగు వారి ఆత్మ గౌరవం నిలిపేందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాముల ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా బస్టాండు కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీ పీ నేతలు నంద్యాల సుబ్బయ్య, కమలాపురం గౌస్‌, పల్లె గంగాధర్‌, జెండాల మహబూబ్‌బాష, మిట్టా శ్రీరాముల రెడ్డి పాల్గొన్నారు.

బద్వేలులో....

బద్వేలు, డిసెంబరు 15: పట్టణంలోని అమరజీవి పొట్టిశ్రీరాములు వర్ధంతిని ఆర్యవైశ్య వర్తక సంఘం ఆవోపా వాసవీ వణితాక్లబ్‌ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా మజ్జిగప్యాకె ట్లు, భోజనం ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కె.వి.సుబ్బారావు, వాసవీ క్లబ్‌ అధ్యక్షుడు బొలిశెట్టి సుబ్బారావు, సీనియర్‌ న్యాయవాది పి.వి.ఎ్‌స.ప్రసాద్‌, దేవి, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

మైదుకూరులో...

మైదుకూరు, డిసెంబరు 15: అమరజీవి పొట్టి శ్రీరాములు  వర్ధంతి ని మైదుకూరులో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో అమ్మవారిశాల నుంచి పొట్టి శ్రీరాములు సర్కిల్‌ వరకు ఆయన చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. అక్కడున్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివా ళులర్పించారు. వాసవీ, వనితా క్లబ్‌ ఆధ్వర్యంలో విగ్రహం వద్ద అన్నదానం నిర్వహించారు. పాదాచారులకు, వాహనదారులకు అన్నం ప్యాకెట్లను అందచేశారు.  ఆర్యవైశ్య సంఘం నేతలు నేతి రెడ్డయ్య, వందవాసి బాబు, గొర్లమందల శ్రీదర్‌, తల్లం సుధాకర్‌, పబ్బతి గోపాల్‌, సురేంద్ర, మలిపెద్ది హరినాద్‌, నవతా సతీష్‌ పాల్గొన్నారు. 

పులివెందులలో...

పులివెందుల టౌన, డిసెంబరు 15: తెలుగు వారి ఐక్యత కోసం జీవితాన్ని త్యాగం చేసి తొలిభాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ సాధన కోసం అహర్నిశలు కృషిచేసిన త్యాగఽ దనుడు అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అర్పించారు. మంగళవారం పొటి ్టశ్రీరాములు వర్దంతి పురస్కరించుకుని పూ లంగళ్ల సర్కిల్‌ వద్ద పొట్టిశ్రీరాములు విగ్రహా నికి  మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, వైసీపీ నేతలు వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ అభిషేక్‌రెడ్డి నివాళులర్పించారు. 

Updated Date - 2020-12-16T04:46:55+05:30 IST