-
-
Home » Andhra Pradesh » Kadapa » Postpone tenth class exams
-
పదో తరగతి పరీక్షలు వాయిదా
ABN , First Publish Date - 2020-03-25T09:59:23+05:30 IST
పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రెండు వారాల పాటు

కడప (ఎడ్యుకేషన్), మార్చి 24: పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రెండు వారాల పాటు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 31 తరువాత పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలు ప్రకటిస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.