పోలీసుస్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2020-12-18T04:58:28+05:30 IST

మండల కేంద్రమైన వల్లూరు పోలీసుస్టేషన్‌ను కడప సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి సునీల్‌కుమార్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పోలీసుస్టేషన్‌ ఆకస్మిక తనిఖీ
రికార్డులు పరిశీలిస్తున్న డీఎస్పీ

వల్లూరు, డిసెంబరు 17: మండల కేంద్రమైన వల్లూరు పోలీసుస్టేషన్‌ను కడప సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి సునీల్‌కుమార్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ అంతా కలియదిరిగి, స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. వీరి వెంట రూరల్‌ సీఐ ఈశ్వర్‌రెడ్డి, స్థానిక ఎస్‌ఐ రాజగోపాల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T04:58:28+05:30 IST