అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు

ABN , First Publish Date - 2020-11-20T05:05:02+05:30 IST

అంసాఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి అన్నారు.

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు
డీఎస్పీకి పుష్పగుచ్ఛాలు అందిస్తున్న సచివాలయ మహిళా పోలీసులు

రైల్వేకోడూరు, నవంబరు, 19: అంసాఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన రైల్వేకోడూరు పోలీ్‌సస్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మట్కా, పేకాట, కోడి పందేలు, వ్యబిచారం, వైట్‌ కాలర్‌ నేరాలు, ఎర్రచంద నం అక్రమ రవాణా తదితర వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎర్రచందనం అక్రమ తరలింపు విష యంలో ప్రజల సహకారం ఉంటే స్మగ్లర్లు అడివిలోకి వెళ్లే ప్రసక్తే ఉండదన్నారు. స్మగ్లర్లు అలికిడి తెలిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందిస్తే పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎ్‌సపీని సీఐ ఆవుల ఆనందరావు ఘనంగా సత్క రించారు. ఎస్‌ఐలు పెద్ద ఓబన్న, రెడ్డి సురేష్‌, పసుపుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

నూతన డీఎస్పీకి సన్మానం 

రాజంపేట, నవంబరు19 : రాజంపేట నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శివ భాస్కర్‌రెడ్డిని గురువారం పట్టణ సచివాల య మహిళా పోలీసులు పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. డీఎస్పీ మాట్లాడు తూ కరోనా నివారణకు సచివాలయ పోలీసు లు  మెరుగైన సేవలందించారన్నారు.

Updated Date - 2020-11-20T05:05:02+05:30 IST