పోలి చెరువుకు వరదనీరు

ABN , First Publish Date - 2020-12-07T04:44:23+05:30 IST

రాజంపేట పట్టణం ఆనుకొని ఉన్న మండలంలోని అతిపెద్ద చెరువైన ఊటుకూరు చెరువుకు భారీగా వరదనీరు చేరుతున్నట్లు ఇరిగేషన్‌ డీఈ రంగయ్య తెలిపారు.

పోలి చెరువుకు వరదనీరు

రాజంపేట టౌన్‌, డిసెంబరు6 : రాజంపేట పట్టణం ఆనుకొని ఉన్న మండలంలోని అతిపెద్ద చెరువైన ఊటుకూరు చెరువుకు భారీగా వరదనీరు చేరుతున్నట్లు ఇరిగేషన్‌ డీఈ రంగయ్య తెలిపారు. ఆదివారం పోలి చెరువుకు వస్తున్న వరదనీటిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్లంగేరు, ఊటుకూరు చెరువు నుంచి భారీగా వరద నీరు వస్తోందన్నారు.  ఇప్పటికే 95శాతం చెరువు నిండినట్లు తెలిపారు.  సోమవారం నాటికి పోలి  చెరువు పూర్తిగా నిండుతుందని డీఈ తెలిపారు. 

Read more