-
-
Home » Andhra Pradesh » Kadapa » Poksoo case registered on both sides
-
ఇరువురిపై పోక్సో కేసు నమోదు
ABN , First Publish Date - 2020-03-13T10:27:29+05:30 IST
చెన్నూరు పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ మదరసాలో నలుగురు బాలికలపై అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డ ఇరువురిపై పోక్సో యాక్ట్ కింద

చెన్నూరు, మార్చి 12: చెన్నూరు పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ మదరసాలో నలుగురు బాలికలపై అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డ ఇరువురిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.పెద్ద ఓబన్న తెలిపారు. గురువారం మదరసాకు చెందిన ఆయా నలుగురు బాలికలతో వచ్చి స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మదరసాలో పనిచేసే జలీల్‌ఖాన్, వాచ్‌మెన్ బిలాల్ రెండు మూడు నెలుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాలికలు తన దృష్టికి తెచ్చారని ఆయా తెలిపారు. పవిత్రమైన మదరసాలో ఇలాంటి నీచులు ఉండడం దారుణమని ఎస్‌ఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.