జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-19T11:20:41+05:30 IST

పదోతరగతి పరీక్షలు జూలై 10 నుంచి 17వ తేది వరకు జరుగుతాయని డీఈఓ పి.శైలజ పేర్కొన్నారు. డీఈవో కార్యాలయంలో

జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు

మోడల్‌ ప్రశ్నాపత్రాలు వెబ్‌సైట్‌లో

భౌతికదూరం, మాస్కులు తప్పనిసరి: డీఈవో


కడప (ఎర్రముక్కపల్లె), మే 18: పదోతరగతి పరీక్షలు జూలై 10 నుంచి 17వ తేది వరకు జరుగుతాయని డీఈఓ పి.శైలజ పేర్కొన్నారు. డీఈవో కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగా రూపొందించిన ప్రశ్నాపత్రాల నమూనాలు డీఈవో, డీసీఈబీ వెబ్‌సైట్లలో పొందుపరచడం జరిగిందని స్పష్టం చేశారు. అయితే పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు భౌతికదూరం, మాస్కులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. గతంలో 11 పేపర్లకు పరీక్షలు నిర్వహించగా ఈ సారి ఆరు పేపర్లకు మార్చామని, పేపరు-1, పేపరు-2 కలిపి ఒక పేపరుగా చేశామన్నారు. ప్రతి సబ్జెక్టుకు వంద మార్కులు ఉంటాయని తెలిపారు. పరీక్షా సమయం 3 గంటల 15 నిమిషాలు ఉంటుందన్నారు.


సబ్జెక్టుల వారీగా మార్కులు

ఇంగ్లీషు - పేపరుకు సంబంధించిన రీడింగ్‌, కాంప్రహెన్షన్‌ 30 మార్కులు, గ్రామర్‌, ఒకాబులరీ 40 మార్కులు, క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్‌ 30 మార్కులు కలిపి వంద మార్కులు ఉంటాయి. 


సోషల్‌ స్టడీస్‌ - సెక్షన్‌-1 లో 12 ప్రశ్నలకు 12 మార్కులు, సెక్షన్‌-2 లో 16 మార్కులు, సెక్షన్‌-3లో 32 మార్కులు, సెక్షన్‌-4లో 40 మార్కులు మొత్తం వంద మార్కులు.


జనరల్‌ సైన్స్‌ - ఆబ్జెక్టివ్‌ సైన్స్‌ 12 మార్కులు, వెరీ షాట్‌ ఆన్సర్స్‌ 16 మార్కులు, షాట్‌ ఆన్సర్స్‌ 32, ఎస్‌ఏ డయాగ్రమ్స్‌ 40 మార్కులు మొత్తం వంద.


గణితం - ఆబ్జెక్టివ్‌ 12 మార్కులు, వెరీ షాట్‌ ఆన్సర్స్‌ 16, షాట్‌ ఆన్సర్స్‌ 32, ఎస్‌ఏ ఆన్సర్స్‌ కలిపి వంద మార్కులు.


మాస్కులు - భౌతిక దూరం తప్పనిసరి

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు భౌతికదూరం పాటిస్తూ మాస్కు లు తప్పనిసరిగా ధరించాలని డీఈఓ శైలజ తెలిపారు. అలాగే శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు.

Updated Date - 2020-05-19T11:20:41+05:30 IST