-
-
Home » Andhra Pradesh » Kadapa » Pest control with sidewalks in rice PD
-
వరిలో కాలిబాటలతో తెగుళ్ల నివారణ : పీడీ
ABN , First Publish Date - 2020-12-31T05:09:03+05:30 IST
వరిని తూర్పు, పడమర దిశలుగా కాలిబాటలు ఏర్పాటు చేస్తే పంట తెగుళ్ల బారిన పడకుండా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని ఆత్మ పీడీ చంద్రానాయక్ అన్నారు.

అట్లూరు, డిసెంబరు 30: వరిని తూర్పు, పడమర దిశలుగా కాలిబాటలు ఏర్పాటు చేస్తే పంట తెగుళ్ల బారిన పడకుండా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని ఆత్మ పీడీ చంద్రానాయక్ అన్నారు. వైఎ్‌సఆర్ పొలం బడిలో భాగంగా బుధవారం రెడ్డిపల్లెలో వరి పంటను మండల వ్యవసాయాఽధికారి శివరామకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరి నాట్ల సమయంలో మీటరున్నర నుంచి రెండు మీటర్ల వ్యవధిలో కాలి బాటలు ఏర్పాటు చేసి వరిపంటను సాగు చేయాలన్నారు. దీంతో పొలానికి కలుపు నాశిని మందులు యూరియా, ఇతర పోషకాహర మందులు వేసినప్పుడు కాలిబాటల నుంచి పొలానికంతటికి సమపాళ్లలో చేరుతుందన్నారు. ప్రస్తుతం వరికి ఆకుమచ్చ తెగులు, కాండం తొలుచు తెగులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాండం తొలుచు పురుగు, ఆకుచుట్టు పురుగు నివారణకు కార్బన్ హైడ్రో క్లోరైడ్ 400గ్రాములు, ఆకు చుట్టు పురుగు నిరవారణకు పామ్ 40 ఎంఎల్, మందులు పిచికారి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆత్మ ఏపీడీ మైఖల్‌రాజు ఏడీఏ పద్మావతి , వీహెచ్‌ఏ రామమోహన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.