అరటి రైతుకు ఊరట

ABN , First Publish Date - 2020-03-28T09:51:09+05:30 IST

లాక్‌డౌన్‌తో కోలుకోలేని దెబ్బతిన్న అరటి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టిన్నట్లు పులివెందుల ఓఎస్డీ

అరటి రైతుకు ఊరట

టన్ను రూ.3400 కొనేలా ఆదేశాలు


పులివెందుల టౌన్‌, మార్చి 27:అనిల్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఉద్యాన, రెవెన్యూ అధికారులు, అరటి వ్యా పారులు, రైతులతో సమావేశం నిర్వహించారు.  పులివెందుల అరటికి ఉన్న డిమాండ్‌ను బట్టి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి భావించారన్నారు. రైతుల వద్ద నుంచి టన్ను రూ.3400తో అరటిని కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.


వాహనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో వివరాలు, బండి నెంబర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం తరపున స్టిక్కర్‌ కూడా అతికిస్తామన్నారు. మార్కెటింగ్‌ శాఖ ఆర్‌టీడీ సు ధాకర్‌, తహసీల్దార్‌ శ్రీనివాసు లు, సీఐ భాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిన్నప్ప పాల్గొన్నారు.


అరటి తరలింపునకు అనుమతి 

అరటి రైతులు పంటను ఇతర రాష్ట్రా లకు తీసుకెళ్లి అమ్ముకునేందుకు ప్రభుత్వం 289 జీఓ ద్వారా అ నుమతి ఇచ్చిందని తహసీల్దారు శ్రీనివాసులు తెలిపారు. బసనపల్లె, సావిశెట్టిపల్లెకు చెందిన వెంకటేశ్వర్లు, చెన్నక్రిష్ణయ్య అరటి పంటను లారీలకు లోడ్‌ చేసుకోగా వాటిని పరిశీలించి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లేవిధంగా అనుమతులు మంజూరు చేశామన్నారు. 

Updated Date - 2020-03-28T09:51:09+05:30 IST