ప్రజాభిప్రాయ సేకరణతోనే యురేనియం ఉత్పత్తి

ABN , First Publish Date - 2020-12-20T05:42:46+05:30 IST

వచ్చేల నెల 6వ తేదీన జరిగే ప్రజాభిప్రాయ సేకరణతోనే యు రేనియం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని యురేనియం ప్రా జెక్టు మేనేజర్‌ ఎంఎస్‌ రావు తెలి పారు.

ప్రజాభిప్రాయ సేకరణతోనే యురేనియం ఉత్పత్తి
మాట్లాడుతున్న యురేనియం ప్రాజెక్టు మేనేజర్‌ ఎంఎస్‌ రావు

వేముల, డిసెంబరు 19: వచ్చేల నెల 6వ తేదీన జరిగే ప్రజాభిప్రాయ సేకరణతోనే యు రేనియం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని యురేనియం ప్రా జెక్టు మేనేజర్‌ ఎంఎస్‌ రావు తెలి పారు. శనివారం ఆయన యురే నియం కార్యాలయంలో విలేకరు లతో మాట్లాడుతూ ప్రస్తుతం 30.5 లక్ష ల టన్నుల ముడి యురేనియా న్ని వెలికితీసేందుకు సన్నాహాలు మొదలుపెట్టామన్నారు. యురేనియంతో ఎలాంటి భయాందోళనలు అవసరం లేద న్నారు. యురేనియం సంస్థ రూ.37.22 కోట్లతో టైలింగ్‌ పాండ్‌ను హెచ్‌డీపీఈ 1.5ఎంఎం మందంతో  ఈ పాలితిన్‌ కవర్‌ మీద మట్టిపోసి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తామన్నారు.  అలాగే 300 హెక్టార్లలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం  చేపట్టనున్నట్లు తెలిపారు. భూములు కోల్పోయిన అర్హులకు ప్రస్తుతం ఏర్పాటుచేసే ప్లాంట్‌ పరిధిలో  కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చి తర్వాత వారిని రెగ్యులర్‌ చేస్తామన్నారు. అలాగే సీఆర్‌డీ నిధులతో యురేనియం ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.  కార్యక్రమంలో డీజీఎం సర్కార్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌, అడ్మిన్‌ చీఫ్‌ మేనేజర్‌ ఛటర్జీ, మేనేజర్‌ పర్సనల్‌ షిండే, సీఎస్‌ఆర్‌ పాండా, నవీన్‌కుమార్‌, మేనేజర్‌ కేకేరావు, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ ఆర్‌కే మిశ్రా, గంగిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T05:42:46+05:30 IST