పెన్షన్‌ భిక్ష కాదు.. హక్కు

ABN , First Publish Date - 2020-12-18T05:02:14+05:30 IST

పెన్షన్‌ భిక్ష కాదు.. హక్కు అని పెన్షనర్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి కె.శంకర్‌రావు పేర్కొన్నారు.

పెన్షన్‌ భిక్ష కాదు.. హక్కు
ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న పెన్షనర్స్‌ సంఘం నేతలు

ఎల్‌ఐసీ పెన్షనర్ల ధర్నాలో పెన్షనర్ల సంఘం నేతలు

కడప(సెవెన్‌రోడ్స్‌), డిసెంబరు 17: పెన్షన్‌ భిక్ష కాదు.. హక్కు అని పెన్షనర్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి కె.శంకర్‌రావు పేర్కొన్నారు. స్థానిక ఎల్‌ఐసీ డివిజనల్‌ కార్యాలయం ఎదుట దేశవ్యాప్త పిలుపుమేరకు గురువారం జరిగిన ధర్నాలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేతన సవరణ జరిగినప్పుడు పెన్షన్‌ కూడా పునరుద్ధరించాలని, 2010కి ముందు ఉన్న పెన్షన్‌ విధానాన్ని నూతనంగా పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా ఐసీఈయూ కడప డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రఘునాధరెడ్డి పెన్షనర్లకు సంఘీభావం వ్యక్తం చేసి మాట్లాడారు. కార్యక్రమంలో పెన్షనర్స్‌ సంఘం నాయకులు కస్తూరి రంగాచార్యులు, సుధాకర్‌, రత్నమయ్య, నారాయణరెడ్డి, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ డివిజన్‌ అధ్యక్షుడు సీఎస్‌ ప్రకాశ్‌రావు, ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-18T05:02:14+05:30 IST