పెన్నానది వద్ద రక్షణ గోడ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2020-12-21T04:47:51+05:30 IST

సిద్దవటం పెన్నానది బ్రిడ్జి వద్ద నుంచి కోట మీదుగా గండిపాలెం రేవు వరకు రక్షణ గోడను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు.

పెన్నానది వద్ద రక్షణ గోడ ఏర్పాటు చేయాలి
పెన్నానది వద్ద పరిశీలిస్తున్న తులసిరెడ్డి

 కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి

సిద్దవటం, డిసెంబరు20 : సిద్దవటం పెన్నానది బ్రిడ్జి వద్ద నుంచి కోట మీదుగా గండిపాలెం రేవు వరకు రక్షణ గోడను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. రెండు రోజుల క్రితం తిరుపతి పట్టణానికి చెందిన ఏడుగురు విద్యార్థులు పెన్నానదిలో సరదాగా ఈత కోసం వెళ్లి గల్లంతై మృతి చెందిన  స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఏటా సిద్దవటం పెన్నానదిలో పడి అనేక మంది మృత్యువాత పడు తున్నారన్నారు.సంవత్సరాలుగా ఎంతోమంది నదిలో దిగి గల్లంతై విగత జీవులయ్యారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రక్షణ గోడ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నదిలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబానికి రూ.25లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే జిల్లాలోని మైలవరం, ఆది నిమ్మాయపల్లె, గండి వాటర్‌, పుష్పగిరి, బుగ్గవంక, పాపాఘ్ని తదితర ప్రాంతాలలో కంచెను ఏర్పాటు చేసి సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ పోలీసులను కూడా నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసులు, కడప నగర అధ్యక్షుడు విష్ణుప్రీతమ్‌రెడ్డి, కమలాపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కోటపాటి లక్ష్మయ్య, మనోహర్‌, బాబు, సాదిక్‌, శ్రీను, అమర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-21T04:47:51+05:30 IST