-
-
Home » Andhra Pradesh » Kadapa » PCC Working President Tulasireddy angry with the government
-
నవరత్నాలు కాదు... రాళ్లు
ABN , First Publish Date - 2020-12-28T05:47:14+05:30 IST
పేరుకే నవరత్నాలు.. ప్రజల వద్దకు వచ్చేసరికి అవి రాళ్లుగా మారుతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వంపై మండిపడ్డ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి
కడప (నాగరాజుపేట)/ వేంపల్లె, డిసెంబరు 27: పేరుకే నవరత్నాలు.. ప్రజల వద్దకు వచ్చేసరికి అవి రాళ్లుగా మారుతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం దాదాపు 50 మందికిపైగా విద్యార్థులు ఎనఎ్‌సయూఐలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ రోజున విడుదల చేసిన 77 జీవోతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదివితే జగనన్న విద్యాదీవెన వర్తించదని జీవో సారాంశమన్నారు.
స్కాలర్‌షి్‌పలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఘనత అన్నారు. విద్యాసంస్థలకు రావాల్సిన రూ.550 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్య పథకాన్ని కొనసాగించి ఈడబ్ల్యూసీ అమలు చేయాలన్నారు. ఈ ప్రభుత్వంలో పేద విద్యార్థుల ఉన్నత చదువులు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, పార్టీ నాయకులు గుండ్లకుంట శ్రీరాములు, పొట్టిపాడు చంద్రశేఖర్‌రెడ్డి, విష్ణుప్రీతంరెడ్డి, లక్షుమయ్య, ధ్రువకుమార్‌రెడ్డి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల స్థలాల పంపిణీ కొత్తది కాదు
పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ, ఇళ్లు కట్టించడం కొత్త అంశం కాదని, దీనికి ఇంత ఆర్భాటం హంగామా అవసరమా అని తులసిరెడ్డి అన్నారు. వేంపల్లెలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2004 నుంచి 2014 మధ్యకాలంలో కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో రూ.20,709 కోట్లు ఖర్చు చేసి 64 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్కరికి 3 సెంట్ల నుంచి 5 సెంట్ల వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, ప్రస్తుతం వైసీపీ సెంటు, సెంటున్నర స్థలం మాత్రమే ఇస్తోందన్నారు. ఇందులో నిర్మించే ఇళ్లు పిచ్చుక గూళ్లను తలపింపచేస్తాయని ఎద్దేవా చేశారు.