-
-
Home » Andhra Pradesh » Kadapa » Pawan Kumar as BJYM state secretary
-
బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా పవన్‌కుమార్
ABN , First Publish Date - 2020-12-30T05:34:28+05:30 IST
భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా బత్తల పవన్‌కుమార్ నియమితులయ్యారు.

కడప (మారుతీనగర్), డిసెంబరు 29: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా బత్తల పవన్‌కుమార్ నియమితులయ్యారు. కడపకు చెందిన పవన్‌కుమార్ ఇదివరకే బీజేవైఎం కడప జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పలు పోరాటాలు చేశారు. తన ఎంపికకు కారకులైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, కిసాన్ మోర్చారాష్ట్ర అధ్యక్షుడు వంగళ శశిభూషణ్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌లకు ధన్యవాదాలు తెలిపారు.