తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.35 వేలు చెల్లించాలి
ABN , First Publish Date - 2020-12-08T05:05:24+05:30 IST
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపుమేరకు బద్వేలులో సోమవా రం జనసేన నాయకులు తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు.

బద్వేలు, డిసెంబరు 7: నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేలు, తక్షణసాయం కింద రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపుమేరకు బద్వేలులో సోమవా రం జనసేన నాయకులు తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్బంగా జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ నందకిశోర్, రమే్‌షలు మాట్లాడుతూ వైసీపీ వ్యవసాయ రైతు పక్షపాతి ప్రభుత్వం కాదని, రైతులను భక్షించే ప్రభుత్వమని తీవ్రస్థాయిలో ఆరోపించారు. తుఫానుతో అపార నష్టం జరిగి, రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే అసెంబ్లీలో హేళనలు, వెటకారాలు చేసుకుం టూ కాలం గడపటం అత్యంత బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే సాయం ప్రకటించాలని, లేదంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జనసేన కార్యకర్త తరుణ్, కిరణ్, శ్రీను, నరసింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.