రైతు సమస్యలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా
ABN , First Publish Date - 2020-12-02T05:00:42+05:30 IST
రైతులకు పరిహారం చెల్లించాలని కోరిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సస్పెండ్ చేయడం దుర్మార్గమని టీడీపీ నియోజకవర్గ నేత డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్, టీడీపీ మహిళా కార్యదర్శి ఝాన్సీ, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్‌బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేతల ధ్వజం
బద్వేలు, డిసెంబరు1: తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సస్పెండ్ చేయడం దుర్మార్గమని టీడీపీ నియోజకవర్గ నేత డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్, టీడీపీ మహిళా కార్యదర్శి ఝాన్సీ, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్‌బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పక్షాన మాట్లాడేందుకు అవకాశం అడిగినందుకు చంద్రబాబును సస్పెం డ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు పోరాట ఫలితంగానే అర్ధరాత్రి జీఓ చేసి రూ.5.90కోట్లు రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించారన్నారు. అసెంబ్లీ ప్రచారాలను మూడు ఛానళ్లకే అనుమతి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని, రాజధానిని అభివృద్ధి చేయలేని ఘనత వైసీపీకే దక్కిందన్నారు. చంద్రబాబును ప్రశ్నించే వారికి ప్రత్యేక హోదా పై కేంద్రాన్ని అడిగే దమ్ము, ధైర్యం ఎందుకు లేదన్నారు. వైసీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కె. వేణుగోపాల్, బీసీ సేవాసంఘం డివిజన్ అధ్యక్షుడు గంటా వెంకటయ్య యాదవ్, మల్లికార్జునరెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతులకు న్యాయం చేయాలనడం తప్పా: రెడ్యం
ఖాజీపేట, డిసెంబరు 1 : ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు న్యాయం చే యాలని అసెంబ్లీలో కోరడం తప్పా అని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ప్రశ్నించారు. మం డలంలోని దుంపలగట్టులోని ఆయన నివాసంలో మంగళ వారం విలేకరులతో మాట్లాడారు. శాసన సభలో మంత్రులు వీధిరౌడీల్లా మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇప్పటికైనా నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం చేయాలన్నారు. రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, గౌస్, మహబూబ్‌భాష, అన్నమారాజు, సాయిక్రిష్ణ పాల్గొన్నారు.