-
-
Home » Andhra Pradesh » Kadapa » Panta Kotha
-
పంట కోత ప్రయోగంలో 31 బస్తాలు
ABN , First Publish Date - 2020-11-22T04:29:50+05:30 IST
పంట కోత ప్రయోగం చేయగా 31 బ స్తాల ధాన్యం వ చ్చిందని ప్రకృతి వ్యవసాయాధికారి నాగరాజు తెలిపారు.

కలసపాడు, న వంబరు 21: చిం తపల్లెలో వెంకటరమణ పొలంలో శనివారం పంట కోత ప్రయోగం చేయగా 31 బ స్తాల ధాన్యం వ చ్చిందని ప్రకృతి వ్యవసాయాధికారి నాగరాజు తెలిపారు. ప్రకృతి వ్యవసాయాధికారి ఆధ్వర్యంలో చెన్నారెడ్డిపల్లె క్లస్టరు చింతపల్లెలో వ రి పంట కోత ప్రయోగం నిర్వహించారు. ఇందులో నిర్ధేశించిన కొలత ల్లో నూర్పిడి చేయగా ఎకరాకు 31బస్తాలు దిగుబడి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతిలో దొరికే వాటితో మందులు చేస్తారని, ఖర్చు తగ్గడంతో పాటు పంట బాగా వస్తుందన్నారు. దానిని ఉపయోగించే వారికి అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు. జడ్పీ ఎనఎ్‌ఫసీఏ రామసుబ్బారెడ్డి, ఎమ్మార్పీలు బ్రహ్మానందరెడ్డి, వెంకటరమణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.