జోరుగా వరి ధాన్యం అమ్మకాలు

ABN , First Publish Date - 2020-11-26T04:24:46+05:30 IST

ధర్మాపురం గ్రామం ప్రధాన రోడ్డుపక్కనే రైతులు ముందస్తుగా వర్షం రాకముందే ధాన్యాన్ని కాటా వేసి విక్రయిస్తున్నారు.

జోరుగా వరి ధాన్యం అమ్మకాలు
జమ్మలమడుగు నుంచి ట్రాక్టర్‌లో తరలిస్తున్న వరి ధాన్యం

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 25: జమ్మలమడుగు మండలంలోని పలు ప్రాంతాల్లో రైతులు అప్రమత్తమయ్యారు. ఇటీవల మండలంలోని ధర్మాపురం, గొరిగెనూరు, దానవులపాడు, బొమ్మేపల్లె, గూడెం చెరువు తదితర ప్రాంతాల్లో వరికోతలు ప్రారంభించారు. జిల్లాలో నివర్‌ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు అప్రమత్తం చేయడం వలన రైతులు మంగళవారం నుంచి వరిధాన్యం కోతలు జోరుగా ప్రారంభించారు. బుధవారం సాయంత్రానికి ధర్మాపురం గ్రామం ప్రధాన రోడ్డుపక్కనే రైతులు ముందస్తుగా వర్షం రాకముందే ధాన్యాన్ని కాటా వేసి విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం 78 కేజీల జిలకరమసూర వరి ధాన్యం బస్తా రూ.1150లతో విక్రయించినట్లు తెలిపారు. వంద కేజీల మినుముల బస్తా రూ.7,800 ధర ఉందని రైతులు తెలిపారు. Read more