ఎవరూ బయటకు రావద్దు

ABN , First Publish Date - 2020-11-26T04:55:59+05:30 IST

రాబోయే రెండు రోజులపాటు నివర్‌ తుఫాను కారణంగా జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని కడప సబ్‌కలెక్టర్‌ పృథ్వీతేజ్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎవరూ బయటకు రావద్దు

రెండు రోజుల పాటు భారీ వర్షాలు 

సబ్‌ కలెక్టర్‌ పృథ్వీతేజ్‌

కడప(కలెక్టరేట్‌), నవంబరు 25: రాబోయే రెండు రోజులపాటు నివర్‌ తుఫాను కారణంగా జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని కడప సబ్‌కలెక్టర్‌ పృథ్వీతేజ్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసే శిబిరాల్లో ఉండాలని తెలిపారు. నదులు, చెరువులు, వంకలు, వాగుల వద్దకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. కడప రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ప్రజలు అత్యవసర సహాయం కొరకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని కంట్రోల్‌ రూము నెంబరు 08562-295990కు సంప్రదించాలని సబ్‌కలెక్టర్‌ ఆ ప్రకటనలో వివరించారు. 

Updated Date - 2020-11-26T04:55:59+05:30 IST