ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈవో

ABN , First Publish Date - 2020-12-29T05:04:55+05:30 IST

ఓబులవారిపల్లె మండలం గద్దలరేవుపల్లె పంచాయతీ పాయలవారిపల్లె హరిజనవాడలోని ప్రభుత్వ పాఠశాలను డిప్యూటీ డీఈవో సోమవారం పరిశీలించారు.

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈవో

ఓబులవారిపల్లె, డిసెంబరు28 : ఓబులవారిపల్లె మండలం గద్దలరేవుపల్లె పంచాయతీ పాయలవారిపల్లె హరిజనవాడలోని ప్రభుత్వ పాఠశాలను డిప్యూటీ డీఈవో సోమవారం పరిశీలించారు. గ్రామస్థులకు, ప్రధానోపాధ్యాయులకు మధ్య ఏర్పడిన వివాదం కారణంగా నాడు-నేడు నిధులతో జరగాల్సిన పనులు ఆగిపోయాయి.   గ్రామస్థుల ఫిర్యాదు మేరకు డిప్యూటీ డీఈవో చంద్రారెడ్డి పర్యటించి పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పద్మజ, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:04:55+05:30 IST