హక్కుల సాధనకు ఓబీసీలు ఏకం కావాలి

ABN , First Publish Date - 2020-03-02T10:25:28+05:30 IST

హక్కుల సాధన కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీ, బీసీలను ఏకం చే సి పోరాటాలు సాగిస్తామని ఓబీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర కో-కన్వీనర్‌

హక్కుల సాధనకు ఓబీసీలు ఏకం కావాలి

కడప (మారుతీనగర్‌), మార్చి 1: హక్కుల సాధన కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీ, బీసీలను ఏకం చే సి పోరాటాలు సాగిస్తామని ఓబీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర కో-కన్వీనర్‌ వండాడి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక నేషనల్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూలులో ఓబీసీ ఫెడరేషన్‌ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.


ఆలిండియా బీసీ రిజర్వేషన్‌ జాతీయ అధ్యక్షుడు జస్టిస్‌ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో బీసీల హక్కుల కోసం ఓబీసీ ఫెడరేషన్‌ ముందుండి పోరాటం సాగిస్తున్నదన్నారు. దేశ జనాభాలో మనమెంతో మనకు అంత వాటా.. అన్న నినాదంతో పాలక ప్రభుత్వాలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్నామన్నారు. జిల్లాలో తమ ఫెడరేషన్‌ బీసీ, ఓబీసీ కులాలన్నింటినీ కలుపుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. 


ఓబీసీ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ 

ఓబీసీ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఇందిరాభాయి, గౌరవాధ్యక్షురాలుగా నారాయణమ్మ, లలిత, ఉద్యోగ విభాగం అధ్యక్షుడిగా ఎన్‌వీ సుబ్బయ్య, కార్యదర్శిగా బాలబ్రహ్మం, సి.నరసింహులు, వెంకటసుబ్బయ్య, అలాగే యువజన విభాగం అధ్యక్షుడిగా శేషగిరి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా రామ్మూర్తి, కార్యదర్శిగా శంకరయ్య, ఉపాధ్యక్షుడిగా చంద్రబాబు, బి.రామకృష్ణ, వెంకటసుబ్బయ్య, సురే్‌షబాబు, శ్రీనివాసులు, వెంకటయ్య, మురళి, పాలకొండ్రాయుడు తదితరులు ఎంపికయ్యారు. 

Updated Date - 2020-03-02T10:25:28+05:30 IST