వర్షాలతో కుదేలైన కంది రైతు

ABN , First Publish Date - 2020-12-21T04:35:15+05:30 IST

వరుస వర్షాల తో కంది రైతుల పరిస్థితి డొల్లగా మారింది.

వర్షాలతో కుదేలైన కంది రైతు
కలసపాడులో ఏపుగా పెరిగిన కందిపంట

కలసపాడు, డిసెంబరు 20:  వరుస వర్షాల తో కంది రైతుల పరిస్థితి డొల్లగా మారింది. పంట  ఏపుగా పెరిగింది. కానీ పూత, పిందె ఎక్కడా కనిపించడం లేదు. మండలంలో అధికారికంగా 600 ఎకరాలు సాగు చేశా రు. అనఽధికారికంగా మరింత ఎక్కువగా నే సాగైంది. ఈక్రా్‌పలో పంట నమోదు చేయించుకోకపోవడంతో ప్రస్తుత పరిస్థితి నెలకొంది. దాదాపు పూత దశకు చేరు కో గా వరస వర్షాలతో పూత మొత్తం రాలిపోయింది.


ఎకరాకు అన్నిరకాల ఖర్చులు లెక్కవేస్తే రూ.15వేలు ఖర్చవుతోంది. కానీ ఎకరా పంట ప్రస్తుతం కోసి నా కనీసం 50కిలోలు కూడా దిగుబడి వచ్చే అవకా శం లేదు. ఇటీవల మళ్లీ వాతావరణంలో మార్పులు వచ్చి మొగిలి(మంచు) వస్తుండడంతో ప్రస్తుతం అరకొరగా వచ్చిన పూత మొత్తం రాలిపోతోం ది. చెట్లు ఏపుగా పెరిగినా దిగుబడి ఏ మాత్రం వచ్చే అవకాశం లేదని రైతన్నలు వాపోతున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వానికి అన్ని పంటల మాదిరిగానే నివేదికలు పంపాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-12-21T04:35:15+05:30 IST